సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

Feb 10,2024 21:26
ఫొటో : చెక్కులు అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : చెక్కులు అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ, ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన సన్నుబోయిన అరుణకుమారి ఆమె భర్త వెంకటేశ్వర్లు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించగా, అందుకోసం లక్షల రూపాయల ఖర్చు అయ్యాయని, అయినప్పటికీ కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎంఎల్‌ఎ మేకపాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రి సహాయనిధి అందజేయాలని విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి సిఎం సహాయనిధి ద్వారా రూ.5లక్షలకు మంజూరు చేయించారు. అలాగే సన్నుబోయిన అరుణ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బ్రాహ్మణపల్లిలోని తమ నివాసంలో అందజేశారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి ప్రభుత్వంగా అందరి మనన్నలు పొందుతున్న జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రభుత్వ వైద్యాన్ని అందరికి అందుబాటులోకి తెస్తూనే ఆపదలో ఉన్న ఆపన్నలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయాలు అందజేస్తుందన్నారు.

➡️