సిఎం జగన్‌ను ఆదరించాలి

Feb 13,2024 21:55
ఫొటో : యాత్రలో మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

ఫొటో : యాత్రలో మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
సిఎం జగన్‌ను ఆదరించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం అందుతున్న ప్రభుత్వ పథకాల లబ్ధి యధావిధిగా కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని అందరూ ఆదరించాలని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అయ్యవారిపల్లి, సింగారెడ్డి పల్లి గ్రామాల్లో మేకపాటి విజయ సంకల్ప యాత్రను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందుతున్న ప్రతి సంక్షేమ పథకం కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఉండాలని ప్రతిఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ఆదరించాలన్నారు. ఎంఎల్‌ఎగా తనను గెలిపిస్తే నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి గతంలో చేసిన అభివృద్ధి కంటే మరింత అభివృద్ధిని చేస్తానన్నారు. మేకపాటి హయాంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో విద్యా వైద్యం సంక్షేమం అభివృద్ధి జరిగిందని సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. మేకపాటి కుటుంబం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలలో ఉన్నామని, కాబట్టి రాబోయే ఎన్నికలలో ఉదయగిరి ఎంఎల్‌ఎగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి చెరుకుపల్లి రమణారెడ్డి, ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి, రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పి సి అల్లూరు రాజు, వైసిపి మండల కన్వీనర్‌ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపిలు కల్లూరు జనార్థన్‌ రెడ్డి, అబ్రహం పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

➡️