సిఎం సహాయనిధి చెక్కు అందజేత

Feb 11,2024 21:19

 ప్రజాశక్తి-గంట్యాడ : మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన బండారు అన్నపూర్ణమ్మకు ఆదివారం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.2లక్షల చెక్కును అందజేశారు. కొన్ని రోజుల నుంచి అన్నపూర్ణమ్మ బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకున్నారు. సుమారుగా ఐదు లక్షల వరకు ఖర్చు అయింది. నిరుపేద కుటుంబం కావడంతో అనేక ఇబ్బందులు గురవుతున్న సమయంలో స్థానిక సర్పంచ్‌ జాగరపు అప్పారావు.. ఎమ్మెల్యే అప్పలనరసయ్య దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయాన్ని ఆయన సిఎం జగన్మోహన్‌ రెడ్డికి చేరవేశారు. సిఎం స్పందించి రూ.2లక్షలు మంజూరు చేశారు. దీంతో చెక్కును అన్నపూర్ణమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి వర్రి నరసింహమూర్తి, వైసిపి సీనియర్‌ నాయకులు నారాయణమూర్తి రాజు, మదనాపురం సర్పంచ్‌ జాగరపు అప్పారావు పాల్గొన్నారు.

➡️