సిఐ రాములు నాయక్‌కు సన్మానం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం సీఐ రాములు నాయక్‌, ఎస్‌ఐ సుదర్శన్‌లను శుక్రవారం గిరిజన నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ప్రాంత గిరిజన సమస్యలను వారికి వివరించారు. గిరిజనులకు అండగా ఉండాలని కోరారు. శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు, సుద్దకురవ తండా సర్పంచ్‌ బి వెంకటేశ్వర్లు నాయక్‌, పుల్లలచెరువు జడ్పిటిసి వాగ్యానాయక్‌, వైసీపీ జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షులు రాములు నాయక్‌, పీఆర్సీ తండా సర్పంచ్‌ బద్దు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️