సుందరయ్య కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం

సుందరయ్య నగర్‌ వాసుల ర్యాలీలో పాల్గొన్న ఏపూరి గోపాలరావు

వినుకొండ: ఏళ్ళ తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకొని చీకట్లో, మురుగులో నివాసం ఉంటున్న సుందరయ్య నగర్‌ వాసులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, నాయకులు విఫలమయ్యారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు అన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుందరయ్య నగర్‌ వాసులు పార్టీ కార్యాలయం నుండి తాసిల్దార్‌ కార్యా లయం వరకు సోమవారం ర్యాలీ చేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి 250 కుటుంబాలు సుం దరయ్య నగర్‌లో నివాసం ఉన్నాయని అన్నారు. కాలనీ వాసులు రాత్రి వేళల్లో చీకట్లో ఉండాల్సి వస్తుందని వర్షం పడితే రోడ్లు, మురుగు కాలువలు లేక మురుగులోనే మగ్గిపోతున్నారని అన్నారు. ఇళ్లల్లో కరెంటు సౌకర్యం, వీధూల్లో లైట్లు లేక చీకట్లో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం కాలనీకి రావాలంటే సమస్యలు పరిష్కరించాల్సిందేనని అన్నారు. అధికారులు స్పందించికాలనీలో మంచినీటి సౌక ర్యాన్ని కల్పిస్తూ రేషన్‌ ఆటోను పంపాలని, పింఛన్‌ లు కాలనీకి వచ్చి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా అనంతరం తహశీల్దార్‌ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె హను మంతరెడ్డి, ఎ.ఆంజనేయులు, ఆర్‌. ముని వెంకటేశ్వర్లు, జి నవీన్‌ కుమార్‌, ఎస్‌.కె నాసర్‌బి, రామకృష్ణ, గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️