స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు రావాలి

Feb 12,2024 21:30

ప్రజాశక్తి-నెల్లిమర్ల : విద్యార్థులు స్టార్టప్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వారికి సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని వైస్‌ ప్రెసిడెంట్‌ డి.ఎన్‌.రావు స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ ‘సెంచూరియన్‌ కోడింగ్‌ క్లబ్‌’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగం సంపాదించడం గొప్ప కాదని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వారు ఎదగాలని కోరారు. కోడింగ్‌ నేర్చుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. ఛాన్సలర్‌ జి.ఎస్‌.ఎన్‌.రాజు, గ్రామ్‌ తరంగ్‌ ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్‌ సెంటర్‌ సిఇఒ బాబు శంకర్‌, వైస్‌ ఛాన్సెలర్‌ పి.కె. మహంతి మాట్లాడారు. కార్యక్రమంలో డీన్లు పిఎస్‌వి రమణారావు, ఎం.ఎల్‌.ఎన్‌. ఆచార్యులు, సన్నీ డియోల్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆర్‌.ఎస్‌.వర్మ పాల్గొన్నారు.

➡️