హబీబుల్లాబేగ్‌ కృషి అభినందనీయం: జంకె

ప్రజాశక్తి-పొదిలి: పొదిలి పట్టణంలో పేదలకు సాయం అందించడంలో హబీబుల్లాబేగ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ కృషి అభినందనీయమని మార్కాపురం మాజీ శాసనసభ్యులు, జిల్లా వైసిపి అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్ల భవనంలో పొదిలి తాలూకా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏ బాదుల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తనతో పాటు కుమారుడికి కూడా సేవా దృక్పథాన్ని అలవరిచిన హాబీబుల్లా బేగ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు కరీముల్లా బేగ్‌ను ఆయన అభినందించారు. పొదిలి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జునరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. మర్రిపూడి ఎంపిపి వాకా వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదలకు తానున్నాను అంటూ ప్రతినిత్యం గుర్తుకువచ్చే కరిముల్లాబేగ్‌ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. మానవత సంస్థ ఛైర్మన్‌ మువ్వల పార్థసారథి, ఎస్‌వికెపి కళాశాల కరస్పాండెంట్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపూడి చెంచు సుబ్బారావు(జిసి), ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం తారావాణి మాట్లాడుతూ పేదల సేవకు ఆర్థిక సమస్య అడ్డుకాదని, చేయాలనే పట్టుదల ఉన్న కరిముల్లాబేగ్‌ అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా హాబీబుల్లా బేగ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, ఇతర దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపిజిబి మేనేజర్‌ సునిల్‌ గుప్తా, విశ్రాంత డిప్యూటీ డిఇఓ బి లక్ష్మయ్య, పద్మావతి, సంఘం నాయకులు ఆనికాళ్ల వీరారెడ్డి, దానమ్మ, డిఎల్‌ నరసింహం, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు షేక్‌ షబ్బీర్‌, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️