అంగన్వాడీల నిరవధిక సమ్మె ఉధృతం

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియులతో పాటు సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్‌, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, రైల్వేకోడూరులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మద్దతు తెలియజేశారు. వారి మద్దతుతో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృత రూపం దాల్చుతోంది. కార్యకర్తలు, ఆయాలు ఎక్కడికక్కడ కార్యాలయాల ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాశక్తి-రాయచోటి అంగన్వాడీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే సమస్యలు పరిష్కా రమయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వం సమ్మెను అణిచివేయాలని చూస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.భాగ్యలక్ష్మి అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజైన బుధవారం ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సిఐటియు, ఎఐటియుసి అంగన్వాడీ కార్యకర్తల యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు వర్కర్లు తమ న్యాయమైన కోరికల సాధన కోసం చేస్తున్న సమ్మెను కొందరు అధికారులు నాయకులు చేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు. రాయచోటి పట్టణంలో అంగన్వాడీ ప్రాజెక్టు, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వవలసిన మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉండడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసరాలు సరుకులు, కూరగాయల ధరలు వంట గ్యాస్‌ ధర పెరిగి పంట ఏజెన్సీ చేయడం బాగా ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లేకుంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు సత్య ఏమిటో చూపిస్తామన్నారు. గతంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం చేయడంతో ఆయనకు గుణపాఠం చెప్పి ఇంటికి పరిమితం చేశామన్నారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచి కార్యకర్తల న్యాయమైన కోరికలు తీర్చడం జరిగిందన్నారు. ఇప్పటి ప్రభుత్వంలోని పెద్దలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు తమ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయమైన కోరికలు తీరుస్తామని ప్రయత్నాలు పెంచుతామని వయోపరిమిత కూడా పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ నాలుగున్నర సంవత్సరకాలం పూర్తి అవుతున్న ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న పాపాన పోలేదన్నారు. న్యాయమైన కోరికల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అక్కడ బోధించడం దుర్మార్గంగా ప్లాటి చార్జి చేయించడం చొక్కిలాటకు గురిచేయడం పోలీస్‌ స్టేషన్లో వేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పెరిగిన ధరలకు అనుగుణంగా డబ్బులు ఇవ్వాలని, అలాగే అంగన్వాడీ సెంటర్లో అభ్యభవనాల్లో కొనసాగుతున్నడంతో వాటి కూడా నెలలకాలంగా చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఖాళీ చేయాలంటూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తమ న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఎన్ని రోజులైనా పోరాటాలకు సిద్ధమని హెచ్చరించారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్‌ లగా మార్చాలని వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న సెంటర్‌ అధ్యయనం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు సిద్ధమ్మ, జిల్లా కోశాధికారి బంగారు పాప, ఉపాధ్యక్షలు ఖాజాబీ, అంగన్వాడీ టీచర్లు నాగమణి, అరుణ, విజయ, పద్మజ, కవిత, అంజలి, శైలజా, రెడ్డమ్మ, సుమలత, భూదేవి, అశ్వని దేవి పాల్గొన్నారు.అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలి – సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులురైల్వేకోడూరు : అంగన్వాడీల వేతనాలు వెంటనే ప్రభుత్వం పెంచాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షులు రమాదేవి ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుంచి టోల్గేట్‌ సెంటర్‌ వద్దకు ర్యాలీగా వచ్చి మనవహారం ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. అంగన్వాడీల సమస్యల సాధనకై చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు నిరసనలో ఆయన పాల్గొని మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీని నీటి మీద రాతలుగా మిగిలాయని తెలిపారు. 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని ఇచ్చిన తీర్పును నేటికీ మన రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చలేదని హెల్పర్ల ప్రమోషన్లకు ఎటువంటి నిబంధన రూపొందించలేదని సెంటర్లో నిర్వహణకు అంగన్వాడీలే పెట్టుబడును పెట్టాల్సిన పరిస్థితికి నెట్టబడ్డామని పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా అనేక రకాలుగా చేసిన ఆందోళనలపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించి పోలీసులతో అవమానించిందని ఈ నేపథ్యంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి సెంటర్లు మూసివేసి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతనాలను ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టిడిపి సాంస్కతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్‌ అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, ఎ.రామాంజులు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు పి.శ్రీనివాసులు, యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి రాధ, పద్మ, వెన్నెల, శిరీష, దుర్గ, వనజ, సుజాత, లీల పాల్గొన్నారు.మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మద్దతుమదనపల్లె: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కమిటీ నాయకులు మధురవాణి, రాజేశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు షాజహాన్‌ బాషా సంఘీభావం తెలిపారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తోందని తెలిపారు. అనంతరం జనసేన నాయకులు, దారం అనిత, రమాంజులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ సభ్యులు విజయ, గీత, భాగ్యమ్మ, సుబ్బలక్ష్మి, అకీరునిషా, గంగ, శైలజ సిఐటియు నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పీలేరు: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు రెడ్డమ్మ, శారద అన్నారు. నియోజకవర్గం పరిధిలోని కె.వి పల్లి, కలకడ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. బి.కొత్తకోట : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీల నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకున్నాయి. నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సమ్మెకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఫర్వీన్‌ తాజ్‌, సిపిఐ నాయకులు సలీం, వేణుగోపాల్‌ రెడ్డి, రఘునాథ్‌ ఇతర నాయకులు మద్దతు తెలిపారు. వాల్మీకిపురం: అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు గత రెండు రోజులుగా వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలపై స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి :అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చెంత వరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సుకుమారి పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఓబులమ్మ సెక్టార్‌ లీడర్లు శిరీష, రుక్మిణి, నాగమణి, వెంకటసుబ్బమ్మ, శ్రీవాణి, శారద, గౌరవ అధ్యక్షులు ప్రభావతి, లక్ష్మీదేవి, నాగరాజమ్మ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️