అగ్నిప్రమాద బాధితులకు ‘అనగాని’ సాయం

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణంలోని 13వ వార్డులోని యానాది కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను టీడీపీ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడు, టీడీపీ నాయకుడు శివప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ సహకారంతో బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ప్రమాద ఘటన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు అనగాని సత్య ప్రసాద్‌ పంపించిన పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబాలకు అందించినట్లు చెప్పారు.

➡️