అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం 

పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

రైతులెవ్వరూ అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పాలచర్ల రాజవరం, జీలుగుమిల్లి రెవెన్యూ పరిధిలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటిస్తూ దెబ్బతిన్న పొగాకు, వేరుశనగ, వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, ప్రతి రైతుకి అండగా ఉంటామని అన్నారు. దెబ్బ తిన్న పంటల వివరాలను నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జీలుగుమిల్లిలో వెలుగు కార్యాలయంలో స్త్రీ శక్తి పథకం కింద దాసరి సత్యవతికు మంజూరైన ఆటోను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొర్స పోసమ్మ, జెడ్‌పిటిసి వసంతరావు, సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాస్‌ రెడ్డి, మండల అధ్యక్షులు సంద ప్రసాద్‌, తహశీల్దార్‌ సుందర్‌సింగ్‌, ఎంపిడిఒ కృష్ణ ప్రసాద్‌, ఎఒ గంగాధర్‌, ఎపిఎమ్‌ రామారావు, కె.రాము, చక్రి, సత్యనారాయణ, ప్రేమ్‌, సిహెచ్‌.శ్రీను, రవితేజ పాల్గొన్నారు.

➡️