అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు

సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ లో ఐద్వా జెండా ఆవిష్కరిస్తున్న చిత్రం

సత్తెనపల్లి రూరల్‌: నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజని అన్నారు.సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఐద్వా జెండాను మహిళా సంఘం నాయకురాలు జె.వెంకాయమ్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ఆరోజుల్లోనే మహిళలలు వేతనాల కోసం ఆరోగ్యలు మెరుగుదల కోసం 14 పని గంటల నుండి 8 గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకున్నారని అన్నారు. మహిళా సంఘం పోరాట ఫలితంగా ఎన్‌ టి రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడపిల్లలకి ఆస్తి హాక్కు చట్టం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించారని.వివరించారు. ఐద్యా నాయకురాలు గద్దె ఉమశ్రీ ప్రసంగించారు .ఈ కార్యక్రమంలో జె అనూష డి సుజాత మేరమ్మ అమూల్య ఎస్‌ ఎఫ్‌ ఐ పాల్గొన్నారు.

➡️