అభివద్ధే అజెండాగా ముందుకెళతాం : ఎంపీ

ప్రజాశక్తి-మదనపల్లిమదనపల్లికే తలమా ణికంగా మెడికల్‌ కళాశాల, బిటి కళాశాల యూనివర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు అని రాజంపేట ఎంపీ పెది ్దరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. స్థానిక మిషన్‌ కాంపౌండ్‌లో శుక్రవారం వైసిపి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మదనపల్లి నియోజ కవర్గాన్ని రూ.వందల కోట్లతో అభివద్ధి చేశామన్నారు. ఇంకా మరింతగా అభివద్ధి చేస్తామని తెలిపారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే అభివద్దే అజెండాగా ముందుకు పోతామన్నారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు నాయకుల సమన్వయ సమావేశం జరిగడం వల్ల అందరూ కలసి కట్టుగా రాబోయే ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా క షి చేయాలన్నారు. మదనపల్లికి మెడికల్‌ కళాశాల, బిటి కళాశాలను యూనివర్సిటీ చేయడం, కేంద్ర విశ్వవిద్యా లయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి రోడ్లను కూడా వేయించా మన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్యెల్యే అభ్యర్థిగా నిస్సార్‌ అహమ్మద్‌ను ఎంపిక చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశారు తిప్పారెడ్డికి సర్వేలు అన్నికూడా ఆయనకే మొదటి స్థానంలో వచ్చినా సిఎం మదనపల్లిని మరోసారి మైనా ర్టీలకు కేటా యించాల్సి వచ్చిందని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి సహకారంతో మరింత అభివద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్సీ నరేష్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశారు తిప్పారెడ్డి, ఎపిఎండిసి చైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లాం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ, వైస్‌చైర్మన్‌లు జింకా వెంకటాచలపతి, నూర్‌ ఆజం, జడ్‌పిటిసి ఉదరు కుమార్‌ పాల్గొన్నారు.

➡️