అభివృద్ధికి నిదర్శనం పులివెందుల

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌/వేంపల్లె/కడపపులివెందుల అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శ నీయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో రూ.861.84 కోట్లతో నిర్మించిన పది రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు తన సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా మీ అందరి ముందు నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవెనెలేనన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతం అని, కాలానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. సొంత గడ్డపై మమకారం ఎప్పటికీ తీసిపోయేది కాదన్నారు. పులివెందుల అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఐదు సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఇందుకోసం ప్రత్యే కమైన ప్రణాళికలు, అధికారులతో పర్యవేక్షణ ఉండాలన్నారు. రూ.861.84 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభంపులివెందులలో రూ.861.84 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా కడప రోడ్డులో నాబార్డు, ఆర్‌ఐడిఎఫ్‌ సంయుక్తంగా రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో నిర్మించిన 627 పడకలు కలిగిన ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్యకళాశాల, నర్సింగ్‌ కళాశాలలు, రూ.70 లక్షలతో వైఎస్‌ఆర్‌ జంక్షన్‌లను ప్రారంభించారు. నల్లపురెడ్డిపల్లిలో ప్రభుత్వ, పాడా సంయుక్తంగా ఇదెకరాల్లో రూ.20 కోట్లతో నిర్మించిన ఇంటెగ్రేటెడ్‌ అరటి ప్యాకహేౌస్‌, రూ.38.15 లక్షలతో కూడిన వైఎస్‌ఆర్‌ మినీసెక్రటేరియట్‌ భవనాలను, మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా పులివెందుల మెయిన్‌రోడ్డులో రూ.11.4 కోట్లతో నిర్మించిన సెంట్రల్‌బోలే వార్డును ప్రారంభించారు. బైపాస్‌ రోడ్డులో రూ.20.69 కోట్లతో నిర్మించిన వైఎస్‌.జయమ్మ, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను, రూ.80 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన గాంధీ జంక్షన్‌, పులివెందుల పట్టణ సమీపంలో 100 ఎకరాల్లో రూ.65.99 లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ ఉలిమెల్ల లేక్‌ను ప్రజలకు చేరువ చేశారు. అనంతరం ఇండిస్టియల్‌ పార్క్‌లో రూ.175 కోట్లతో నిర్మించిన ఆధిత్యబిర్లా అనే ప్రయివేటు సంస్థ నిర్మించిన పేస్‌-1 యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఇడుపు లపాయకు చేరుకుని రూ.39.13 కోట్ల ప్రభుత్వ, పాడా నిధులతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ పార్కును ప్రారం భించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలం సురేష్‌, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఎం.టి.కృష్ణబాబు, కడప ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాధ్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కలెక్టర్‌ వి.విజరు రామరాజు, జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భర ద్వాజ్‌, పాడా ఒఎస్‌డి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌డిఒ వెంకటేష్‌, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌ .సతీష్‌ కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ వైసిపి ఇన్‌ఛార్జి వైఎస్‌.మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, మార్కెట్‌ యాడ్‌ చైర్మన్‌ చిన్నప్ప, వివిధ శాఖల అధికారులు, వైసిపి నాయకులు తదితరులు పాలొ ్గన్నారు. సిఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం కడప ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి బయల్దేరివెళ్లారు.

➡️