అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు: మంత్రి

ప్రజాశక్తి-పొదిలి: గ్రామాలలో సుపరిపాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి నిలిచారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన చేస్తున్నాడని కొనియాడారు. సోమవారం మండలంలోని చిలంకూరు గ్రామంలో పాలకేంద్రం, సీసీ రోడ్లు, కాకర్ల గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన మర్రిపూడి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వద్ద ప్రణాళిక ఉందని అన్నారు. అందులో భాగంగానే మొదటి విడత పనులు మంజూరు చేయించినట్లు తెలిపారు. మర్రిపూడి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి సురేష్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లేర్ల నరసింహారెడ్డి, ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, జడ్‌పిటిసి మాకినేని సుధారాణి, పార్టీ కన్వీనర్‌ డి మల్లికార్జున, మాజీ కన్వీనర్‌ బోధ రమణారెడ్డి, మర్రిపూడి, చిమట సొసైటీ చైర్మన్‌లు బివి భాస్కర్‌ రెడ్డి, మాకినేని వెంకట్రావు, నాయకులు మాచేపళ్లి నాగయ్య, ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, ఓగిరాల నారాయణ రెడ్డి, మొనపాటి నరసింహారావు, మొల్లల ప్రభాకర్‌రెడ్డి, మొల్లల శివరామరెడ్డి, మాకినేని రమణయ్య, రమేష్‌, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️