ప్రజాశక్తి-పొదిలి: వైసిపి అవినీతి, అరాచక పాలనతో అభివృద్ధి కుంటుపడిన రాష్ట్రంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కుమారుడు విగేష్‌రెడ్డి అన్నారు. సోమవారం పొదిలి పట్టణం లోని 15వ వార్డులో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇసుక, మద్యం, ఆక్రమణలతో రాష్ట్రాన్ని మాఫియాకు అడ్డాగా మార్చిన ఘనత జగన్‌కు దక్కుతుంద న్నారు. ఐదేళ్ల పాలనలో నిరుద్యోగం భారీగా పెరిగిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ కందుల విగేష్‌రెడ్డికి పూలమాల వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, టిడిపి జిల్లా మైనార్టీ సెల్ నాయకులు ఎస్‌కె రసూల్, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుర్దూస్, సోమిశెట్టి శ్రీదేవి, జ్యోతి మల్లికార్జునరావు, టెంట్ హౌస్ నరసింహారావు, ఎస్‌కె మస్తాన్‌వలి, వీరిశెట్టి సురేష్, కాటూరి శ్రీను, మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
