ఆకులు తింటూ నిరసన

వినుకొండలో ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నఅంగన్వాడీలు

  వినుకొండ: స్థానిక సురేష్‌ మహల్‌ రోడ్డులో అంగన్వాడీ నిర్వహిస్తున్న సమ్మె 14వ రోజుకు చేరింది. రేపటి నుండి సమ్మెను మరింత ఉధృతం చేసేలా నిర్ణయాలు జరుగుతాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీలకు న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలోని అంగ న్వాడీలు ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే జీతానికి ఆకులు, అలములు తప్ప ఇంకేం మిగిలాయని తెలియజేస్తూ రోడ్డుపై అర్థ చంద్రాకారంలో కూర్చొని ఆకులు తింటూ వినూత్న రీతిలో నిరసన తెలియ జేశారు. కార్యక్రమానికి సిఐటియు నుండి హనుమంతరెడ్డి, మాజీ పౌర హక్కుల సం ఘం నాయకులు, ప్రముఖ న్యాయవాది సిహెచ్‌ఎన్‌ఎల్‌ మూర్తి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బా రావులు ప్రసంగించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్‌ ప్రసన్న కుమారి, నాగజ్యోతి, కృష్ణకుమారి ,సుజాత, అంగలకుదురు ఆంజనేయులు, ప్రాజెక్ట్‌ అధ్యక్షుడు కార్యదర్శులు జి.పద్మ, బి. శ్రీదేవి , ఏఐటీయూసీ నుండి పి. ఉమాశంకరి, ఉమామహేశ్వరి, రమాదేవి, నీరజ పాల్గొని నిరసన తెలిపారు. మాచర్ల్ల: అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోవాలని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు ఉషారాణి కోరారు. పట్టణంలోని అం బేద్కర్‌ సెం టర్‌లో ఏర్పాటు చేసిన శిబి రాన్ని సోమవారం ఉదయం ప్రారం భించిన ఉపారాణి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ డిమాండ్లు గొం తెమ్మ కోర్కేలు కాదన్నారు. ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలన్నారు. తమపై ప్రభుత్వం పంతానికి పోకుండా, సమ స్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు రూ . 26 వేలు, హెల్పర్లకు రూ.18 వేలుగా జీతాలను ప్రభుత్వం ప్రకటించాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వారికి గ్రాడ్యూటీ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, 2017 నుండి టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇప్పిం చాలని, చిరు ఉద్యోగులమైన తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని వర్తింప చేయా లని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, మొదలైన డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో అంగన్‌ వాడీ యూనియన్‌ నాయ కులు ఇం దిరా, కాకర్ల పద్మావతి, కోటేశ్వరి, సుందర లీల, శారద, దుర్గా శివలక్ష్మీ, నాగేంద్రం, చాంద్‌ బి, రుక్మిణి, మహలక్ష్మీ, శివపార్వతి, జిజి భారు, రహేనా, చంద్ర కళ, లీలావతి, వెంకట రమణ, నాగలక్ష్మీ, రాధ, హైమవతి పాల్గొన్నారు.

 సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్‌లోని శిబిరంలో పొర్లుదండాలు పెడుతున్న అంగన్వాడీలు

సత్తెనపల్లి: స్థానిక తాలూకా సెంటర్లో ఏర్పాటు ేచేసిన సమ్మె శిబిరంలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ లంతా ‘మా మొర ఆలకించు మహాప్రభు ‘అంటూ పొర్లుదండాలు పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ లెటర్లు భవాని, పద్మ, కమల, జమీల సత్తెనపల్లి ముప్పాళ్ళ రాజుపాలెం మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు హెల్పర్స్‌ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పిడుగురాళ్ల: అంగన్వాడి సమస్యల పరి ష్కరించాలని కోరుతూ రిలే దీక్షలు అంగన్వాడి ప్రాజెక్టు డి.శాంతమని రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 14 రోజులుగా అంగన్వాడీలు సమ్మె నెరవేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని,. అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరంలో సిఐ టియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు షేక్‌ హజ్రా, అంగన్వాడీలు ఎస్‌ ఇందిరా, పద్మావతి ,హేమలత, అరుణ, మాధవి, నాగమణి, అరుణకుమారి, రామా రూతమ్మ, శివ పార్వతి, వెంకట రమణ, శివరంజని ధనలక్ష్మి , శ్రీలక్ష్మి , లక్ష్మీ దుర్గ పాల్గొన్నారు.

➡️