ప్రజాశక్తి-వల్లూరు ఆడపడుచులను ఆదుకునేందుకు వీలుగా జగనన్న చేయూత పథకానికి శ్రీకారం చుట్టారని కమలాపురం నియోజవర్గం శాసనసభ్యులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎపిఎస్ ఆర్‌టిసి చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం చేయూత చెక్కుల పంపిణీలో వారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మండల, పట్టణ పరిధిలోని మహిళలకు లక్షల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. 45 నుండి 60ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల అభ్యున్నతి కోసం సొంత కుటుంబ సభ్యుని వలె ఏడాదికి రూ.18,750 అందిస్తున్నారని అన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి, స్వయం ఉపాధి కొరకు పాటుపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి వెంకటసుబ్బయ్య, వైసిపి మండల కన్వీనర్ అబ్బి రెడ్డి, వీరారెడ్డి, మాజీ ఎంపిపి శివకుమార్ రెడ్డి , వైఎస్‌ఆర్ జనరల్ సెక్రటరీ ఇందిరెడ్డి శంకర్ రెడ్డి, ఎంపిటిసి రామకష్ణారెడ్డి , మండల అధి కారులు, వైసిపి నాయకులు గుర్రంపాటి వెంకటసుబ్బారెడ్డి , రఘురామిరెడ్డి నారా యణరెడ్డి , లబ్ధిదారులు పాల్గొన్నారు.
