ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో మంగళవారం ఆశా డే జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు జి సుధాకర్ పాల్గొని మాట్లాడారు. ఆశ కార్యకర్తలకు పని భారాన్ని తగ్గించాలని, పనికి తగిన వేతనం అందించాలని కోరారు. ఆశాల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, వేతనాలు పెంచి సకాలంలో అందజేయాలని పలు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించేంతవరకు సిఐటియు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యాధి కారి సిహెచ్ రామలక్ష్మిని కలిసి కార్యకర్తల సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ సభ్యులు ఉన్నారు.
