ఇంజనీరింగ్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి

 పిడుగురాళ్ల: మున్సిపల్‌ కార్మికుల 16 రోజుల సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్‌ కార్మి కులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెం టనే జీవోలు ఇచ్చి అమలు చేయాలని కోరుతూ పిడుగురాళ్ల మున్సిపల్‌ కమిష నర్‌ బి.ఎస్‌. గిరికుమార్‌కు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ నైపుణ్యం ప్రకారం వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పే స్కేల్‌ ప్రకారం వేత నాలివ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వీటిపై సత్వరమే చర్యలు తీసుకోకుంటే దశల వారీగా ఆందోళన చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ కార్మికులు కె.రాజు, బ్రహ్మయ్య, శ్రీను, రమేష్‌, ప్రతాప్‌, షలార్‌, వెంకయ్య, విజరు కుమార్‌, మోహన్‌రావు పాల్గొన్నారు. సత్తెనపల్లి టౌన్‌: ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీరు యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం.హరిపోతురాజు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు రూ.21 వేలు, డ్రైవర్లకు రూ.24,500 ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు జీవో విడుదల చేయాలని కోరారు. సమ్మెకాలపు వేతనాలివ్వాలని, సంక్రాతి కానుక రూ.వెయ్యి ఇవ్వాలని కోరారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వా లని, పిఎఫ్‌ ఖాతాల వివరాలు తెలపాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్‌ చేశారు.ఈ మేరకు వినతిపత్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ కె.షమ్మీకి అందిం చారు. నాయకులు రాజకుమార్‌, చంద్ర కళ, దుర్గా, జయమ్మ, లూదియమ్మ, శ్రీను, వి.శ్రీను, అచ్చమ్మ, రోశమ్మ, వెంకాయమ్మ పాల్గొన్నారు.

➡️