ఇజ్రాయిల్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి వద్ద రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వారు ఢకొీని బుధవారం తెల్లవారుజామున రాజుపాలెం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్‌(19) మృతి చెందిన వార్త తెలుసుకొని యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిమిత్తం తీసుకొచ్చిన ఇజ్రాయిల్‌ భౌతిక కాయాన్ని టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు సందర్శించారు. వైద్యులు, పోలీసులతో ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎరిక్షన్‌ బాబు ఇజ్రాయిల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రమాద ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు మంత్రు నాయక్‌, చిట్టేల వెంగళరెడ్డి, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, మెడబలిమి అచ్యుతరావు, వలరాజు, పాలడుగు వెంకట కోటయ్య, కె భాస్కర్‌, చెవుల అంజయ్య, బోడా శ్రీశైలపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️