ఉత్సాహంగా జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్

ఉత్సాహంగా జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్

ప్రజాశక్తి-కాకినాడ67వ జాతీయ స్దాయి అండర్‌ 19 బాలుర టెన్నిస్‌ టోర్నీమెంట్‌ రెండో రోజు అత్యంత ఉత్సహవంతమైన వాతవరణంలో ఆదివారం నిర్వహించారు. ఈ మ్యాచ్‌లు మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆవరణ, డి.మార్ట్‌ దగ్గర ఉన్న స్మార్ట్‌ సిటీ టెన్నిస్‌ క్లబ్‌, ఎస్‌పి ఆఫీస్‌లో టెన్నిస్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. రెండోరోజు టోర్నమెంట్‌లో టీమ్‌ ఈవెంట్‌లో తొమ్మది మ్యాచ్‌లు నిర్వహించారు. మహారాష్ట్ర, కేంద్రీయ విద్యాలయ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మహారాష్ట్ర (2-1) తో విజయం సాధించింది. తెలంగాణ, హర్యానా మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హర్యానా (2-0)తో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ (2-0)తో విజయం సాధించింది. రాజస్థాన్‌, ఢిల్లీ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ (2-0) విజయం సాధించింది. గుజరాత్‌, ఢిల్లీ మధ్య జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ (2-0) విజయం సాధించింది. మహారాష్ట్ర హర్యానా మధ్య జరిగిన సెమీ ఫైనల్‌లో హర్యానా (2-1) విజయం సాధించింది. ఆర్‌జెడి జి.నాగమణి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జి.భానుమూర్తి రాజు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బివివిఎస్‌వి.ప్రసాద్‌, ఆఫీసియల్‌ కె.శ్రీకుమార్‌, ఉప విద్యాశాఖాధికారులు ఆర్‌.జె.డేనియల్‌రాజు, డి.సుభద్ర, బి.శ్రీనివాస కుమార్‌, సిహెచ్‌ రవి, ఏసుదాసు, శివ ప్రసాద్‌, ఆర్‌వి.ప్రసాద్‌, పి.పుల్లయ్య, హెచ్‌ఎం టివిఎస్‌.రంగారావు, వి.రవిరాజు, వై.బంగార్రాజు పాల్గొన్నారు.

➡️