ఉద్యోగుల పై దాడి దుర్మార్గం

ప్రజాశక్తి – నెల్లిమర్ల : పురపాలక సంఘం ఉద్యోగులపై దాడి చేయడం దుర్మార్గమని ఎపి మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం విశాఖ రీజియన్‌ ఉపాధ్యక్షులు వైఎస్‌సిహెచ్‌ పాపయ్య రాజు అన్నారు. పిడుగురాళ్ల పురపాలక సంఘంలో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగుల పై కొందరు నాయకులు దాడి చేసి గాయపర్చిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ బుదవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయం కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి పాల్పడింది ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గాయపడ్డవారి కాంప్లెయింట్‌ పై తక్షణమే తగుచర్య తీసుకోవాలని కోరారు. ఇలాంటి దాడులను ముక్త ఖంఠంతో ఖండిస్తూ, పిడుగురాళ్ల మునిసిపల్‌ ఉద్యోగుల పోరాటంలో నెల్లిమర్ల నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు కలసినడుస్తూ మద్దతు తెలియచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️