ఉద్యోగుల సంక్షేమానికి కార్యవర్గం కృషి చేయాలి

ఎన్నికైన నూతన కార్యవర్గంతో జిల్లా వ్యవసాయ అధికారి కె.బోసుబాబు

ప్రజాశక్తి-ముమ్మిడివరం

ఉద్యోగులకు విధి నిర్వహణలో ఎదు రయ్యే సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారి సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యవసాయ అధికారి కె.బోసుబాబు అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎయిమ్స్‌ ఇంజి నీరింగ్‌ కళాశాల్లోని జిల్లా కార్యాలయాల ప్రాంగణం లోని ఆడిటోరియం హాలు నందు వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.బాల భాస్కర్‌ అధ్యక్షతన నూతనంగా ఏర్పడిన జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా కాకి నాగేశ్వర రావు, సహాయ వ్యవసాయ సంచాలకులు(ఆలమూరు), ఉపాధ్యక్షు నిగా కె.ప్రభాకర్‌, వ్యవసాయ అధికారి (రాయవరం), జనరల్‌ సెక్రటరీగా ఎస్‌.రాకేష్‌, వ్యవసాయ అధికారి (మలికిపురం), జాయింట్‌ సెక్రటరీ గా ఎన్‌వివి.సత్య నారాయణ వ్యవసాయ అధికారి(అల్లవరం), ట్రెజరర్‌గా కె.సునీత, వ్యవసాయ అధికారి (అమలాపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులు గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.ప్రవీణ్‌(జనరల్‌సెక్రెటరీ), బి.మురళీ కష్ణ(ట్రెజరర్‌)లు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి.రామారావు, వ్యవసాయ అధికారి ఎస్‌. ప్రశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️