ఎన్నికల నిర్వహణలో జోనల్‌ అధికారులు కీలకం

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ

-జిల్లా కలక్టర్‌ ఎం. విజయ సునీత

ప్రజాశక్తి -పాడేరు :సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి సెక్టోరల్‌ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలక్టర్‌ ఎం.విజయసునీత స్పష్టం చేశారు. శనివారం కలక్టరేట్‌ సమావేశం మందిరంలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం సెక్టోరల్‌ అధికారులకు ఎన్నికల ప్రక్రియపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులు నిర్వహించవలసిన విధి విధానాలపై తగు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుండి ఎన్నికల సామగ్రి, ఓటింగ్‌ యంత్రాలు, ఎన్నికల సిబ్బందిని సకాలంలో పోలింగ్‌ కేంద్రాలకు చేర్చవలసిన బాధ్యత సెక్టార్‌ అధికారులపైనే ఉందన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌, అదనపు పోలీసు బలగాలను నియమిస్తున్నట్లు తెలిపారు. గత అనుభవాలను దష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని సూచించారు.. పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత్‌, తాగు నీటి సదుపాయాలు సమకూర్చాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రవర్తనానియమావళి పక్కాగా అమలుచేయలన్నారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్‌ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి నివేదించాలన్నారు. సెక్టోరల్‌ అధికారులకు మెజిస్టీరియల్‌ వివి. పాబ్‌లు, కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌ మార్చవలసి వస్తే తప్పనిసరిగా మాక్‌ పోలింగ్‌ నిర్వహించాల్సిందేనని కలక్టర్‌ స్పష్టం చేసారు. పాడేరు రిటర్నింగ్‌ అధికారి భావన వశిస్ట్‌ మాట్లాడుతూ, రిసెప్షన్‌ కేంద్రం మార్గం ఇరుకుగా ఉన్నందున పోలింగ్‌ అనంతర సామగ్రిని ప్రవేశ ద్వారం వరకు తీసుకు వచ్చి వెంటనే సంబంధిత వాహనాన్ని పార్కింగ్‌ ప్లేస్‌ కు తరలించాలని, సామగ్రి తీసుకోవటానికి ఏర్పాటు చేసిన కౌంటర్లలో దేనికి సంబంధించిన కౌంటర్లలో వాటిని అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమములో డిఆర్‌ఒ బి.పద్మావతి, స్పెషల్‌ డిప్యూటీ కలక్టర్లు వివిఎస్‌.శర్మ, పి.అంబేద్కర్‌, పాడేరు నియోజకవర్గం సెక్టార్‌ అధికారులు పాల్గొన్నారు.

-జిల్లా కలక్టర్‌ ఎం. విజయ సునీత

➡️