ప్రజాశక్తి – కడప అర్బన్ ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఆదేశాలను ఎన్నికల ముందే ఎస్‌బిఐ అమలు చేయాలని, కుంటి సాకుల వెనుక బిజెపి ఒత్తిడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ అన్నారు. సోమ వారం స్థానిక ఏడు రోడ్ల కూడలిలోని ఎస్‌బిఐ బ్రాంచ్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఎన్నికల బాండ్ల లావాదేవీలపై ఈనెల13 లోపు సుప్రీం కోర్టుకు ఎస్‌బిఐ అన్ని బ్రాంచ్‌లు తెలియ జేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ఒత్తిడితో లోక్ సభ ఎన్నికల తర్వాత ఎస్‌బిఐ. ఎన్నికల బాండ్ల వివరాలు, లావాదేవీలు, పేర్లు, ఇస్తామనడం అహే తుకమైన విషయమని చెప్పారు. సుప్రీం కోర్టు ఎన్నికల ఎలక్ట్రోరల్ బాండ్స్ చట్టాన్ని కొట్టివేస్తూ, 21 రోజు లోపల 2019 నుంచి 2024 వరకు ఎన్నికల బాండ్ల వివ రాలు, లావాదేవీలు, ఇచ్చిన వారు, పుచ్చుకున్న వారి వివరాలు, సుప్రీం కోర్టుకు ఈనెల 13 లోపు తెలియ జేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, బిజెపి ఒత్తిడితో ఎస్‌బిఐ నేటి నుంచి మళ్లీ 116 రోజులు గడువు కావాలని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయటం చూస్తుంటే దారుణమన్నారు. దీని బట్టి చూస్తే 2024 ఏప్రిల్ ఎన్నికలు ముందు వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేనట్లు తెలు స్తుందన్నారు. ఎన్నికల బాండ్ల వాస్తవాలు, నిజాలు దేశ ప్రజలకు తెలియజేయకుండా ఆపటానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం లోని ఎస్‌బిఐ రాజ్యాంగ సంస్థను ప్రభావితం చేస్తున్నట్లుగానూ తేటతెల్లమవుతోందని ఆరోపించారు. ఎస్‌బిఐ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రాథమిక సమాచారంలో రూ. 6 వేల 565 కోట్ల విలువచేసే వాళ్లు బిజెపి ఎన్నికల విరాళాలు బాండ్లు ఇచ్చారని చెప్పారు.22 వేల 217 బాండ్లు అన్ని రాజకీయ పార్టీలకు వచ్చినట్లుగా చెప్పారని దీని వివరాలు చెప్పటానికి నాలుగు నెలల కాలం అవసరం లేదని ఎవరికైనా అర్థ మవుతుందన్నారు. నాలుగు నెలల కిందట బిజెపికి ఎప్పుడు ఎన్నికల విరాళాలు ఇవ్వని 23 కార్పొరేట్ సంస్థలు రూ.9.05 కోట్లు విరాళాలు ఇచ్చాయని చెప్పారని, వారి పేర్లు వెల్లడించడానికి సమయం కోరడం హాస్యాస్పందంగా ఉందన్నారు. దేశ ఎన్నికల్లో అత్యంత అవినీతి కరమైన బిజెపి ప్రభుత్వం అని ప్రజల ముందు నిరూపణ అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, బి.మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులు రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, నగర కమిటీ సభ్యులు ఎస్.రాజేంద్ర పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టే వరకు 2024 సార్వత్రిక ఎన్నికలు జరపవద్దని సిపియం కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు సిపిఎం సోమవారం స్థానిక స్టేట్‌బ్యాంక్ (కోర్టుబ్రాంచ్) ఎదుట ధర్నా నిర్వ హించింది. కార్యక్రమంలో కిరణ్, బాల సుబయ్య, మహిళాసంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్, రాములమ్మ, లకిëదేవి, మల్లికాబాను పాల్గొన్నారు. బద్వేలు : పట్ట ణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న ఎస్‌బిఐ బ్రాంచ్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలి యజేశారు. ఈ సందర్భంగా నాయకులు బిజెపి ఒత్తిడితో లోక్ సభ ఎన్నికల తర్వాత ఎస్‌బిఐ.ఎన్నికల బాండ్ల వివరాలు, లావాదేవీలు, పేర్లు, ఇస్తామనడం అV ాతుకమైన విషయమని పేర్కొన్నారు. కార్య క్రమంలో సిపిఎం బద్వేల్ పట్టణ కార్యదర్శి కె. శీను, పట్టణ నాయకులు ముడియం చిన్ని, ఎస్.కె. మస్తాన్, షరీఫ్, గంగనపల్లి నాగార్జున, ఆంజనేయులు, బాల గుర య్యా, ఇమ్మానేలు, సురేంద్ర, నరసింహ, యువరాజ్, మోక్షమ్మ, మస్తాన్, బాలమ్మ, సుబ్బలక్ష్మి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
