ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థే

పల్నాడు జిల్లా: రానున్న సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎన్నికల విధులు నిర్వ హిస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు విషయాలను అవగాహన చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి పేర్కొన్నారు. బుధవారం నరస రావుపేటలోని మున్సిపల్‌ సమావేశ మం దిరంలో ప్రిసైడింగ్‌, అసిస్టంట్‌ ప్రిసైడింగ్‌ అధికారుల (నియోజక వర్గ మాస్టర్‌ ట్రైనర్లు ) శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ ఎప్పటికప్పుడు ఎన్నిక ల కమిషన్‌ ఆదేశాలపై అవగాహన పెంచు కోవాలని, ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా ఆక ళింపు చేసుకోవాలన్నారు. వచ్చిన సందేహా లను పైఅధికారులను అడిగి ఎప్పట ికప్పుడు పరిష్కరించుకోవా లని సూచిం చారు. ఎన్నికల విధులలో జాగ్రత్త అవసర మని అన్నారు. ఎన్నికల కమిషన్‌ నూతన ంగా ప్రవేశపెట్టిన హోమ్‌ ఓటింగ్‌పై, పోస్టల్‌ ఓటింగ్‌పై అవగాహన కలిగి ఉం డాలని సూచించారు. ఈ సందర్బంగా ఎన్నికల ముందురోజు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి తీసుకోవాల్సిన చర్య లను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.వినాయకం, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి పాల్గొన్నారు. జాబ్‌ మేళాకు విశేష స్పందన ప్రతి నెలా 14 వ తేదీన నిర్వహించే నవోదయం కార్యక్రమాన్ని నరస రావుపేటలోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధికారులు, నవోదయం నోడల్‌ ఆఫీసర్‌ సంజీవరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి. వెం కటేశ్వరరావు, కలెక్టరేట్‌ ఏవో గణపతి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నుండి 110 మంది వివిధ రకాల బ్యాంక్‌ రుణాలకు , ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.’నవోదయం’లో భాగంగా ఆంద్ర óప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి నిర్వహిస్తున్న మినీ జాబ్‌ మేళా కు 39 మంది హాజరు కాగా అందులో 17 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్దులకు కలెక్టర్‌ ఉద్యోగ నియామకపత్రాలు అందించారు. ‘నవో దయం’ లబ్ధిదారులు వెనిగండ్లకు చెందిన బి.లక్ష్మయ్య, పిడుగురాళ్లకు చెందిన ఎ . దానమ్మలకు బ్యాంకు రుణాల ద్వారా కార్లు పంపిణి చేశారు.దార్శనికుడు దామోదరం సంజీవయ్య ఆంధ్రదేశానికి గొప్ప దార్శనికుడు దేశభక్తుడు బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని కలెక్టర్‌ శివ శంకర్‌ అన్నారు. దామోదరం సంజీవయ్య 103 వ జయంతి సందర్భంగా నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నేటి తరం రాజ కీయ నాయకులు సంజీ వయ్య జీవిత చరిత్రను తప్పనిసరిగా తెలుసు కోవాల న్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధి కారి వినాయకం, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధి కారి లోతేటి వరలక్ష్మి , నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్‌ సంజీవరావు, జిల్లా పరి శ్రమల శాఖ అధికారి వెంకటేశ్వరరావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటిగ్రేషన్‌ క్యాంపునకు ఎంపికైన విద్యార్థులకు అభినందన భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ క్యాంపునకు 9 మంది పల్నాడు విద్యార్థులు ఎంపిక కావడంపై కలెక్టర్‌ శివశంకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరస రావుపేట కలెక్టరేట్‌ లో విద్యార్థులను అభినందించారు. నరస రావుపేట మండలంలోని కాకాని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,నరసరావుపేట బాలుర మున్సిపల్‌ హైస్కూలు లకు చెందిన 9 మంది విద్యార్థులు ఈనెల 19 నుండి 23 వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్న భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ క్యాంపునకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున పాల్గొనే సువర్ణ అవకాశాన్ని పల్నాడు జిల్లా విద్యార్థులు కైవసం చేసు కున్నారు. విద్యార్థులన అభినందించిన వారిలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఆర్‌. గోవిందరాజులు, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఉపాధ్యాయులు టి.అంజిరెడ్డి, వి. రాంబాబు న్నారు. జాతీయ స్థాయిలో జరిగే క్యాంపులో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పాల్గొనే స్కౌట్స్‌ దిగ్విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

➡️