ఓటర్ల అవగాహన సదస్సుకు ఏర్పాట్ల పరిశీలన

 తాడేపల్లి రూరల్‌: యువ ఓటర్లకు అవగాహన కల్పించడానికి కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీలో గురువారం జరగనున్న సద స్సుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజర వుతారని తాడేపల్లి మండల తహసీల్దారు నాగిరెడ్డి బుధవారం తెలిపారు. బుదవారం నాడు గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ కె. స్వప్న కెఎల్‌ యూనివర్శిటీని సందర్శించి సదస్సు జరగనున్న స్థలాన్ని పరిశీలించారు. కెఎల్‌ యు విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్‌ చప్పిడి హనుమంతరావుని అడిగి యూనివర్శిటీ వివరాలను తెలుసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు నమోదు పైన యువతీ యువ కులకు అవగాహన కల్పించడానికి కీలక ప్రాం తాల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు నాలుగువేల మంది యువతీ, యువకులు పాల్గొనడానికి అవకాశం కలిగిన ఎఒటి మైదానాన్ని వారు పరి శీలించారు. విద్యార్థులకు ఓటు పట్ల అవ గాహన కల్పించడానికి క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిప్యూటి తహసీల్దారు సతీష్‌, వడ్డేశ్వరం విఆర్వో ఆషా, గుండిమెడ వీఆర్వో మలి ్లఖార్జునరెడ్డి, వర్శిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్ధసారథి వర్మ తదితరులు పాల్గొన్నారు.

➡️