ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావివ్వొద్దు

నరసరావుపేటలో సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్‌, తహశీల్దార్‌

పల్నాడు జిల్లా: ఓటర్ల నమోదు, మృతుల ఓట్ల తొలగింపులు, డబల్‌ ఎంట్రీల తొలగింపులు పారదర్శకంగా జరగాలని మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది, బిఎల్వోలను ఓటరు నమోదు అధికారి అయిన ఆర్‌డిఒ ఎం.శేషిరెడ్డి ఆద ేశించారు. పట్టణంలోని మున్సిపల్‌ అతిథి గృహం, రొంపిచర్ల తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం సమీ క్షించారు. ఫామ్‌ 6, అర్జీలు విచారణ విధానం, నోటీసుల జారీ తదితర అంశాలను డివిజనల్‌ పరి పాలన అధికారి చంద్రారెడ్డి వివరించారు. ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలకు పాల్పడితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో నరసరావుపేట, రొంపిచర్ల తహశీల్దార్లు రమణ నాయక్‌, బి.అంకారావు పాల్గొన్నారు.

➡️