ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 18 వ తేదీ నుంచి 30 తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్ట ణంలోని మాసాపేటలోని ఓ కల్యాణ మండపంలో పదవ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ తరగతికి ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఒక్కొక్కటి 50 మార్కులకు ఉంటాయని తెలిపారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వ హించాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా విద్యార్థులందరూ స్వేచ్ఛగా, భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి సెంటర్లోనూ ఫ్యాన్స్, లైట్లు, డెస్కులు ఉండేరకంగా చూడాలని తెలిపారు. తిరుపతి ఉప విద్యాశాఖాధికారి ఆనందరెడ్డి మాట్లాడుతూ ఈసారి పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు సీరియల్ నెంబర్ కలిగి ఉంటాయని, ఏ విద్యార్థికి ఏ సీరియల్ నెంబరు వచ్చింది తెలుస్తుందన్నారు. ఏ పేపర్ అయినా బయటికి వస్తే ఆ పేపరు ఏ విద్యార్థికి చెందినదనే విషయం సుల భంగా తెలుసుకోవచ్చునన్నారు. పిల్లలు ప్రశ్నాపత్రాలు బయటకు పంప కుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మదనపల్లి ఉపవిద్య శాఖాధికారి శ్రీరామ్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలు ట్రాన్స్ పోర్ట్ సమ యంలో జాగ్రత్త వహించాలని, జవాబు పత్రాలు ప్యాకింగ్ సమ యంలోను జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. డిసిఇబి సెక్రటరీ నాగ ముని రెడ్డి మాట్లాడుతూ చీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సమ యపా లన పాటిస్తూ ప్రభుత్వం వారి ఆదేశానుసారం విద్యార్థులకు సమ యానికి ప్రశ్నపత్రాలు చేరే విధంగా చూడాలని తెలిపారు. అనంతరం ఎఎంఒ రామకృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం పరీక్ష విధానంపై అందరికీ అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఎడి ప్రసాద్‌బాబు, చీఫ్‌సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
