మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
‘కమీషన్లకు సోమిరెడ్డి కక్కుర్తి’
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కమీషన్లకు కక్కుర్తిపడి రైతులను నట్టేట ముంచారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. శనివారం మండలంలోని తోటపల్లి పంచాయతీలో మంత్రి పలు అభివద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా పిఎసిఎస్ డైరెక్టర్ ఈదూరు రామాచార్యులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు సంధించారు.మాజీ మంత్రి సోమిరెడ్డి రాజకీయం అవినీతిమయమని పేర్కొన్నారు. మిల్లర్ల వద్ద కమీషన్లకు కక్కుర్తిపడి రైతాంగాన్ని నట్టేట ముంచిన ఘనుడు సోమిరెడ్డి అని దుయ్యబాట్టారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన హయాంలో ట్రాక్టర్లు వాహనాల కొనుగోలు పంపిణీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు సోమిరెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతి అక్రమాల గురించి తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దష్టికి తీసుకెళ్లానని, అయితే వాస్తవాలు వెలికితీస్తే రైతుల మనోభావాలు దెబ్బతింటాయాన్న ఒకే ఒక కారణంతో విచారణ ఆగిందన్నారు. అసైన్డ్‌మెంట్, పి ఓ టి చట్టాలు తెలియని సోమిరెడ్డికి మంత్రి పదవి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. పట్టాల పంపిణీ విషయంలో తనపై సోమిరెడ్డి చేసిన చేసిన విమర్శలను మంత్రి కాకాణి తిప్పికొట్టారు. సోమిరెడ్డి నక్కజిత్తుల విమర్శలకు తాను భయపడేది లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సోమిరెడ్డి చేసిన అభివద్ధి శూన్యం అన్నారు. పేదవాడికి ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు తమ ప్రభుత్వం దఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోంటోందన్నారు. రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో సర్వేపల్లి నియోజకవర్గం అగ్రగామిగా ఉంచానని తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ఆదరించి తిరిగి శాసనసభ్యునిగా తనకు విజయం చేకూర్చాలని కోరారు. వైసీపీ కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివద్ధి చేస్తే, సర్వేపల్లి నియోజకవర్గాన్ని మంత్రి గోవర్ధన్ రెడ్డి సర్వతోముఖభివద్ధి చేశారని కొనియాడారు. దీనికి ముందు రూ.23 కోట్ల 75 లక్షల విలువైన అభివద్ధి పనులను మంత్రి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జ్యోతి, జెడ్‌పిటిసి శేషమ్మ, సహకార బ్యాంకు చైర్మన్ కావలి రెడ్డి హరిచంద్ర రెడ్డి, వైకాపా నేతలు ఇసనాక రమేష్ రెడ్డి గూడూరు విష్ణు మోహన్ రెడ్డి,తలమంచి సురేంద్రబాబు, వ్యవసాయ శాఖ డిడి సత్యవాణి, ఎంపీడీఓ ప్రత్యూష, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
