కాజ్‌వే నిర్మాణానికి శంకుస్థాపన

Jan 21,2024 21:51
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
కాజ్‌వే నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : 18నెలల క్రితం జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నెలబెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఎన్నో దశాబ్ధాలుగా గండ్లవీడు, వెన్నవాడ తదితర గ్రామాల ప్రజలు కోరుతున్న రామస్వామిపల్లి-నల్లగొండ్ల వరకు రోడ్డు నిర్మాణం, బొగ్గేరుపై కాజ్‌వే నిర్మాణాలకు శంఖుస్థాపన చేయడం ఎంతో శుభపరిణామమని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం గండ్లవీడు గ్రామంలో రూ.9.33 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి ఆయన శంఖుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి ప్రచారానికి వచ్చిన సమయంలో ఇక్కడి ప్రజలు తనను కోరిన ఒకేఒక్క కోరిక ఆత్మకూరు మండలాన్ని కలుపుతూ రోడ్డు నిర్మాణామేనని, ఆ సమయంలోనే తాను ప్రజలందరికీ ఒకటే తెలిపానని, తప్పక మీకు ఇచ్చిన మాట నెరువేరుస్తానని తెలిపానన్నారు. అందరి ఆశీర్వాదంతో 82వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన అనంతరం ఈ గ్రామానికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ గ్రామానికి చెందిన నాయకులు సమిష్టిగా కృషి చేశారని, వారిందరిని గ్రామస్తులు అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన సంస్కరణల ఫలితంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అందాయని, ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.3లక్షల కోట్లను ప్రజలందరికీ అందజేశామన్నారు. పడకండ్ల పంచాయతీలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద ఇప్పటి వరకు రూ.27 కోట్లు అందజేశారని, గత ప్రభుత్వ హయాంలో రూ.2కోట్లు మాత్రమే అందజేశారని, ఇది ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందడంతో నాడు-నేడు ద్వారా విద్యార్థుల చదువులు అభివృద్ధిలోకి రావడం, సచివాలయ వలంటీర్ల వ్యవస్థల ద్వారా గడప దాటకుండానే వారి ఇంటికి సంక్షేమం అందుతుందని, ఇలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన సాగిందని గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు సాగించారని, అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.5లక్షల కోట్లు అవసరమన్నారని అన్నారు. ఇలా ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజలకు జరిగే మంచి ఏమిటన్నారు. జగనన్న ప్రభుత్వం రూ.3లక్షల కోట్లతో విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ప్రతి కుటుంబ సంక్షేమం అభివృద్ధి కోసం శ్రమిస్తున్న తమ జగనన్న ప్రభుత్వాన్ని మీరందరూ కళ్లారా చూశారని, గతంలో మాదిరిగా పచ్చకండువా కప్పుకున్న వారికి మాత్రమే పించన్లు, అభివృద్ధి పనులు అంటూ ప్రభుత్వంలో లేవని, ఇదంతా గమనించి మళ్లీ మన సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, మర్రిపాడు మాజీ మండల కన్వీనర్‌ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి మాముడూరు సుధాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వి.శ్రావణ్‌ కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, కొల్లి అఖిల్‌ నాయుడు, కొల్లి దొరస్వామి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️