కోటప్పకొండ తిరునాళ్ళ .. 3,000 మంది పోలీసులతో బందోబస్తు

పల్నాడు జిల్లా: సందర్శకులు ప్రశాంత వాతావరణంలో త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకునే విధంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్‌ రెడ్డి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కోటప్ప కొండ తిరునాళ్ళ ఉత్సవాలకు బందోబస్తు నిర్వ హించడానికి హాజరైన 3 వేల మంది పోలీస్‌ అధి కారులు, సిబ్బందికి కోటప్పకొండలోని జిల్లా పరి షత్‌ పాఠశాలలో బందోబస్తు విధులపై సిబ్బం దికి అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజి, ఎస్పీ మాట్లా డుతూ మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్ళ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేయా ల్సిన అన్ని ఏర్పాట్ల గురించి పోలీస్‌ అధికారులతో సమీక్షలు నిర్వహించి,పటిష్ఠ ప్రణాళిక రూపొం దించినట్లు చెప్పారు. కోటప్పకొండ తిరునాళ్ళ ఉత్సవాలలో 3 వేల మంది పోలీస్‌ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులతో సున్నితంగా వ్యవహరించాలని, ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా రూపొం దించిన కోటప్పకొండ పార్కింగ్‌ యాప్‌ గురించి ప్రజలకు వివరిస్తూ, నిర్ణీత ప్రదేశాలలో నిలుపు కోవడానికి దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల వద్ద,ప్రభల ప్రదర్శన ప్రాంతాల్లో, దర్శన సమయంలో జన సందోహం స్తంభించకుండా తగిన చర్యలు తీసు కున్నామని, ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవకుండా పోలీస్‌ అధికారులు ,సిబ్బంది విధులు నిర్వర్తిం చాలని అన్నారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌.రాఘవేంద్ర, ఎఆర్‌ అదనపు ఎస్పీ రామ చంద్రరాజు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.నిర్దేశించిన సమయంలోగా కార్యక్రమాలు ముగించాలినిర్వాహకులు నిర్దేశించిన సమయానికి ప్రభను కోటప్పకొండకు తీసుకురావాలని నిర్దేశించిన సమయం అనంతరం అను మతించ బోమని ఐజి, ఎస్పీ చెప్పారు ప్రభలపై ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు కార్యకలాపాలు సాగించరాదని, నిర్దేశించిన సమయంలో గా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముగించాలని అశ్లీల నృత్యాలు చేయరాదని హెచ్చరించారు. ప్రతి ప్రభ వద్ద పోలీసు సిబ్బంది నిఘా ఉంటుందన్నారు.

➡️