క్విజ్‌ విజేతలకు అభినందన

విద్యార్థులను అభినందిస్తున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి-మండపేట

స్థానిక టిడిపి కార్యాలయంలో రిలయన్స్‌ క్విజ్‌ విజేతలను ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు గురువారం అభినందించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన రిలయన్స్‌ క్విజ్‌ -2023 పోటీలలో స్థానిక గౌతమీ మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు ఎస్‌.పావని దుర్గ, ఎస్‌.దీక్షితలు మొదటి స్థానం సాధించి సుమారు రూ.50 వేలు విలువ చేసే రెండు ల్యాప్‌టాప్‌ లను బహుమతులుగా గెలుచుకున్నారు. విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన పి.రామ చంద్రరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయిని సి.హెచ్‌.శోభావళి ఉపాధ్యాయిని వి.సూర్య లతలను ఎంఎల్‌ఎ వేగుళ్ల అభినందించారు.

 

➡️