ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్: ఆల్ ఇండియా బెఫి పిలుపు మేరకు ఒంగోలు రీజినల్ కార్యాలయం వద్ద యూనియన్ బ్యాంకు ఎప్లాయీస్ ఆధ్వరంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బెఫి మాజీ అధ్యక్షుడు శోభన్‌బాబు మాట్లాడుతూ బ్యాంకుల్లో సిబ్బంది కొరత ఉందన్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలన్నారు. టెంపరీ, క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బెఫి జిల్లా ప్రధానకార్యదర్శి సురేంద్ర, జిల్లా రీజినల్ సెక్రటరీ బాలకోటయ్య, యుబిఇయు రాష్ట్ర కార్యదర్శి మహేష్, బెఫి సభ్యులు సాయి, చౌరీ, రాజేంద్ర, శ్రీలత, విద్యా ప్రియ, రాజేశ్వరి, పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు.
