ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నుపల్లి, శాంతినగర్, గాంధీనగర్‌లలో శుక్రవారం టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో సూపర్-6, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ జగన్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనుకకు పోయిందన్నారు. ఐదేళ్లు పరిపాలన చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటింటికీ తిరిగి చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, మంత్రూనాయక్, శ్రీశైలపతి నాయుడు, వేగినాటి శ్రీనివాస్, బోడా చెన్నవీరయ్య, కామేపల్లి వెంకటేశ్వర్లు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
