ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : జిల్లా గ్రంధాలయ సంస్థ కర్నూలు జిల్లా కేంద్ర గ్రందాలయంలో గ్రంధాలయ పితామహుడు పద్మశ్రీ పురస్కారము పొందిన కీర్తి శేషులు అయ్యంకి వెంకట రమణయ్య వర్దంతి ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముందుగా గ్రంధాలయధికారులు వజ్రాల గోవిందరెడ్డి ,యస్ బాష ,పద్మావతమ్మ,ఈశ్వరమ్మ,సువర్నమ్మమరియు విద్యార్థులు జనార్ధన్,కుమార్,స్వర్న లత,స్వేత,హిమ,వినోద్ మరియు పాఠకులు కలిసి అయ్యంకి వారి చిత్రపటంనకు పూలమాల వేస్తూ గ్రంధాలయ ఉద్యంలో వారు చేసిన కృషిని ,తలుస్తూ వారు ఆహుర్వేదం,పకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రకా సంపాదకుడు,గ్రంధాలయసర్వస్వంఅనే పత్రకను నడుపుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ గ్రంధాలయాల అబివృద్దికి ,వ్యాప్తకి విశేషకృషి సల్పారని కొనియాడుతూ మన మందరం వారిని ఆదర్షంగా తీసుకొని మన గ్రంధాలయలను కాపాడుకోవాలని కోరుతూ విజ్నానం పొందలని నివాళులు అర్పించారు.
