ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండకు చెందిన తాటిపర్తి చంద్రశేఖర్‌ను యర్రగొండపాలెం వైసిపి అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ మొట్ట మొదటిసారిగా తన సొంత గ్రామమైన శింగరాయకొండకు శుక్రవారం వచ్చారు. అందులో భాగంగా సుందర్ నగర్‌లోని ఆయన నివాసం వద్దకు వైసిపి నాయకులు భారీగా తరలివచ్చి అభినందనలు తెలియజేశారు. కొండపి, కందుకూరు, ఒంగోలు, యర్రగుంటపాలెం నియోజకవర్గాల నుంచి వైసిపి నాయకులు విచ్చేసి చంద్రశేఖర్‌ను సత్కరించారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు భారీగా రావడంతో చంద్రశేఖర్ నివాసం వద్ద కోలాహాలం నెలకొంది.
