ప్రజాశక్తి-యర్రగొండపాలెం: జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని మొగుళ్లపల్లి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరిట అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయననే గెలిపించుకుందామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నో పథకాలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్ గౌడ్, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్, మొగుళ్లపల్లి సర్పంచ్ కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, ఎంపిటిసి హరిబాబు నాయక్, మండల కన్వీనర్ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
