జగనన్న పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి: మంత్రి

జగనన్న పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి: మంత్రి

జగనన్న పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి: మంత్రి ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : జగనన్న పాలనలోనే రాష్ట్రంలో త్వరితగతిన సంక్షేమం, అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్‌ కె రోజా అన్నారు. పుత్తూరు మండలం కష్ణసముద్రం సచివాలయంలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వంను నిర్వ హించారు. సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాల వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ కష్ణసముద్రం సచివా లయ పరిధిలో అభివృద్ధి సంక్షేమం జరిగిందన్నారు. వీటిని అంకెలతో ప్రత్యక్షంగా చూపుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు తెలుసుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇలాంటి పనులు జరగలేదన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికీ సంక్షేమాన్ని అందించిన జగనన్నను మళ్లీ ముఖ్య మంత్రిని చేసుకోవాలన్నారు. సీఎం జగన్‌తోనే రాష్ట్ర సాధికారత సాధ్యమన్నారు. మీ ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ తమకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కష్ణ సముద్రం గ్రామ ప్రజలు మంత్రి రోజాకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, కో ఆప్షన్‌ సభ్యులు, నాయకులు జే సి ఎస్‌ కన్వీనర్‌, పార్టీ కన్వీనర్‌, అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️