‘జగన్‌ మమ్మల్ని నిండా ముంచేశారు’

 వినుకొండ:స్థానిక సురేష్‌ మహల్‌ రోడ్డులో అంగ న్వాడీల సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా జల దీక్ష చేశారు. ఈ కార్య క్రమాన్ని వినుకొండ మండలంలోని విటమరాజుపల్లిలోని చెరువులో నిర్వ హించి.. నినాదాలు చేశారు. ‘జగన్‌ మమ్మ ల్ని నిండా ముంచేశారు’ అని నినాదాలు చేశారు. 41 రోజులు గడిచినా చలించని ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ ట్రెజరర్‌ ప్రసన్న మాట్లాడుతూ తమ సర్వీసులో ఇంతటి నిరంకుశ వైఖరి కలిగిన ప్రభుత్వాన్ని తాము చూడ లేదన్నారు. డి.బీబులు, ఎన్‌.కృష్ణకుమారి, నిర్మల, హరిత ,శ్రీదేవి, నగ రాజకుమారి హాజరై వారి నిరసన వ్యక్తం చేశారు.

కార్యాలయంలో కింద కూర్చుని నిరసన

చిలకలూరిపేట: పని ఉంటే ఆదివారం నాడు, పండగ రోజుల్లో కూడా పని చేస్తా మని, తాము ఎవరికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేయడం లేదని, వారంతట వారే వచ్చి విధుల్లో చేర తామంటేనే లెటర్లు తీసుకుంటున్నామని నాదెండ్ల సిడిపిఒ శాంత కుమారి అన్నారు. అంగన్వాడీల చేత జాయినింగ్‌ రిపోర్టు తీసుకుంటున్నారన్న సమాచారం తెలుసు కుని ఆదివారం అంగన్వాడి యూని యన్‌ నాయకురాలు జి. సావిత్రి, సిఐటియు మం డల కన్వీనర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు, అంగన్వాడీ కార్యకర్తలు నాదెండ్ల సిడిపిఒ కార్యాలయానికి వెళ్లి విచారించారు. అనధికారికంగా ఫోన్లు చేయించడం, ఇచ్చిన నోటిస్‌ టైం అయిపోయిందని వెంటనే జాయిన్‌ అయితే ఉద్యోగం ఉం టుందని లేకపోతే పోతుందని పలు మార్లు హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఏంటని నాయకులు ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ ఆదివారాలు కార్యాలయాలు తీసి పనులు చేసిన దాఖలాలు లేవని నాయ కులు అన్నారు. ఇందుకు సిడిపిఒ సమా ధానం చెప్పలేదు. ‘మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. అంగన్వాడీల దీక్షలను భగం చేయాలనే ఉద్దేశంతో అంగన్వాడీలకు ఒకరికి తెలియ కుండా మరొకరికి చెప్పడం సబబు కాదని నాయకులు ఈ సందర్భంగా అధికారికి చెప్పారు. అనంతరం నాయకులు అంగ న్వాడీ లతో మాట్లాడారు. 41 రోజు లుగా నిరా హార దీక్షలు చేస్తున్నా అధి కారులు అంగ న్వాడీలను ఏమార్చి ఉద్యోగాలలో జాయిన్‌ చేసుకుంటున్నారని, ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. జాయిన్‌ చేరేందుకు వచ్చిన వారికి నచ్చజెప్పి, వారితో పాటు అక్కడే కింద కూర్చుని నిర సన తెలిపారు.

కనికరంలేని ప్రభుత్వం

పల్నాడు జిల్లా: కార్మికులు కార్మిక సంఘాలు చేప డుతున్న సమ్మెల పట్ల ప్రభుత్వ సాను కూలంగా స్పందించి డిమాండ్లు పరి ష్కరించాల్సి ఉండగా బెదిరింపు ధోరణి , మొండివైఖరి ప్రదర్శిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపి అంగ న్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నరసరావుపేటలోని స్థానిక గాంధీ పార్క్‌ వద్ద ధర్నాచౌక్‌ లో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రామిక మహిళా సమ న్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి శివ కుమారి, యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కెపి మెటిల్డా దేవిలు మాట్లాడుతూ వివిధ రూపాలలో వివిధ రకాల ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేస్తున్నప్పటికీ ప్రభు త్వానికి కనికరం లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అంగన్వాడీలు స్కీం వర్కర్లు కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభు త్వం కుట్రలు చేయడం దుర్మార్గ మన్నారు. అంగన్వాడీలను భయపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె ఆపించేందుకు ప్రభుత్వం ఎన్ని బెది రింపులకు పాల్పడినా డిమాండ్లు నెర వేర్చే దాక సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమ స్యలు పరిష్కారం కోసం విజయ వాడలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన తమ యూనియన్‌ నాయకులను బేష రతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్ట్‌ లీడర్లు డి.మాధవి, బి నిర్మల, డి.సాయి, కవిత, లుదియ, యు పద్మ, బివి రమణ,శోభారాణి పాల్గొన్నారు.

సమ్మె శిబిరంలో లెనిన్‌కు నివాళి

సత్తెనపల్లి: స్థానిక తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో ప్రపంచ కార్మిక ఉద్యమ నేత లెనిన్‌ శత వర్ధంతి సభ జరి గింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ మాట్లాడుతూ లెనిన్‌ పోరాట స్ఫూర్తితో అంగన్వాడీలు పోరాడి తమ డిమాండ్‌లు సాధించాలని అన్నారు. ముందుగా లెనిన్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు జడ రాజకుమార్‌,అంగన్వాడి సత్తెనపల్లి ప్రాజెక్టు అధ్యక్షులు గుజ్జర్లపూడి సుజాత, అంగన్వాడీలు ధనలక్ష్మి, రమాదేవి, ఉమా మహేశ్వరి, భవాని, అరుణ ,నజీమా, పద్మా వతి, అరుణ కుమారి పాల్గొన్నారు.

➡️