సత్తెనపల్లిటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెర వేర్చాలని చేపట్టిన దీక్షలు మంగళవారం వారం నాటికి 22వ రోజుకు చేరాయి. 22వ నెంబర్ ఆకారంలో నిల్చుని కోలాటం వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని సిఐటియు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్ ప్రారం భించారు. కార్యక్రమంలో పాల్గొన్న అంగ న్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి, సిపిఎం ల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెప్పే ‘మాట తప్పం, మడం తిప్పం’ అనే మాటలనే అంగన్వాడీ మహి ళలు కూడా ఆదర్శంగా తీసుకుని తమ డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించే వరకు మాట తప్పడం, మడం తిప్పరని అన్నారు. అనంతరం మహేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ప్రాజెక్టు అధ్యక్ష , కార్యదర్శులు జి.సుజాత , యం అహల్య , ధనలక్ష్మి, దుర్గాభవాని,అంజలి, పద్మ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట: స్థానికంగా గ్రంథాలయం వద్ద అంగన్వాడీల చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరం వద్ద సిఐటియు మండల కన్వీనర్ పేరుబోయి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇప్పటికైనా తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బుధవారం కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరుగుతుంద న్నారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనం తరం మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎ.పద్మ అధ్యక్షత వహిం చారు. శారద, ఎం విల్సన్, ఎస్ బాబు, బి కోట నాయక్, టి ప్రతాపరెడ్డి, సెక్టర్ లీడర్స్,హెల్పర్స్ పాల్గొన్నారు. వినుకొండ: దున్నపోతులాంటి వైఖరి కలిగిన వైసిపి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసా దించాలంటూ అంగన్వాడీలు మంగళ వారం దున్నపోతుకు వినతి పత్రం అంద జేశారు. నిరసన తెలిపారు. అంగన్వాడీలు ప్రత్యేకించి డిమాండ్ చేయడం లేదని ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని అంగన్వాడీలు కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. హను మంత్ రెడ్డి, నాసర్ బి, ఏటీసీ నాయకులు ఎ.మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు. అమరావతి: సమ్మె శిబిరంలో కోలాటాలతో, కబడ్డీ ఆటతోచ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఐదో తేదీ లోపు విధులకు హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకుంటావని బెదిరింపులకు పాల్ప డటం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని ప్రభు త్వాన్ని విమర్శించారు. సమ్మెలో సిఐటియు నాయకులు బి సూరిబాబు పాల్గొన్నారు. మాచర్ల్ల: తమ సమస్యలు ఎప్పుుడు పరి ష్కారం అవుతాయంటూ అంగన్‌వాడీలు సోదమ్మతో ఆరా తీస్తు వినూత్న కార్య క్రమం ద్వారా నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో సోదమ్మతో ఆరా తీసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. జగన ్‌మోహన్‌రెడ్డి సిఎం ఆవుతాడని తానే చెప్పినట్లు తెలిపారు. అందుకే మీరు కూడ ఓట్లు వేసి గెలిపించారని సోదమ్మ తెలిపింది. తమకు కనీస వేతనాలు పెంచటం లేదని, పనిభారం పెరిగిందని సోదమ్మకు ఆంగన్‌వాడీలు తమ సమ స్యలను వివరించారు. దీనిపై సోదమ్మ మాట్లాడుతూ సిఐటియుని వదలకుండా ఆందోళన చేయండి, మీ సమస్యలను సిఎం పరిష్కరిస్తాడని చెప్పింది. సిఎం నేరుగా చర్చలు జరపాలని శిబిరంలో ఆంగన్‌వాడీలు నినదించారు. అనంతరం దున్నపోతు బొమ్మకు వినతిపత్రం అంద జేశారు. అంగన్‌వాడీ యూనియన్ నాయ కులు ఉషారాణి, ఇం దిర, కె.పద్మావతి, కోటేశ్వరి, సుందర లీల, శారద, దుర్గా శివలక్ష్మి, రుక్మిణి, జయలక్ష్మి, శివపార్వతి, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి, జనసేన నాయకులు టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిడుగురాళ్ల: అంగన్వాడి సమస్యల పరిష్కరిం చాలని కోరుతూ సమ్మె శిబిరం కొన సాగింది.ఆర్ అండ్ బి బంగ్లా వద్దకు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వచ్చిన సం దర్భంగా అంగన్వాడీలు తమ సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అంద జేశారు. తమ సమస్యలు వెంటనే పరి ష్కరించే విధంగా ముఖ్యమంత్రికి పంపా లని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి డిమాండ్ల పరి ష్కారా నికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్య దర్శి తెలకపల్లి శ్రీనివాసరావు అంగన్వా డీలు డి శాంత మణి సుజాత,కవిత బుజ్జి, విజయరాణి, శివకుమారి, సఖియా, జయశ్రీ, విజయరాణి శివరంజని, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. ఈపూరు: గత 22 రోజులుగా సమ్మె చేపట్టిన అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. మండల కేంద్రమైన ఈపూరు ఐసి డిఎస్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెకు మంగళవారం ఎస్టి యు ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపి వారికి రెండువేల అందజేశారు.
