జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి – వంగర: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం ముద్దాడ రమణమ్మ, పీడీ బి. కవిత గురువారం తెలిపారు. గత నెల 23, 24, 25 తేదీలలో పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ అథ్లెటిక్స్‌ పోటీలలో లాంగ్‌ జంప్‌ విభాగంలో దేవకివాడ అశోక్‌ ప్రథమ స్థానం, 400 మీటర్ల రిలే విభాగంలో కొమరాపు చందు కూడా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని ఈ నెల 16, 17, 18, 19 తేదీలలో లక్నోలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభనెల్లిమర్ల: జిల్లా స్థాయి పద్య పఠన పోటీల్లో అలుగోలు జెడ్‌పి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎం.హర్ష వర్థన్‌, బి.భార్గవి ప్రతిభ కనబర్చారు. జిల్లా స్థాయి స్థాయి పద్య పఠన సీనియర్‌, జూనియర్‌ విభాగంలో పాల్గొని ప్రతిభ కనబర్చి ప్రోత్సాహక బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా వారిని గురువారం పాఠశాలలో హెచ్‌ఎం జి.ఎస్‌. కాంతారావు, ఉపాధ్యాయులు జి.భవాని, దమయంతి, సంగం నాయుడు అభినందించారు.జాతీయస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు ప్రాజెక్టు ఎంపిశృంగవరపు కోట: జాతీయ స్థాయి 31వ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బోజంకి భరత్‌, బొబ్బిలి గాయత్రి రూపొందించిన టిసిఎస్‌ – టీ కాఫీ శాండ్‌ ప్రాజెక్టు ఎంపికైంది. గుంటూరులోని కే.ఎల్‌ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలలో 187 ప్రాజెక్టులు ప్రదర్శించగా భరత్‌ రూపొందించిన టీ కాఫీ శాండ్‌ జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మహేశ్వరరావు తెలిపారు. గైడ్‌ టీచరుగా పొట్నూరు శివాజీ వ్యవహరించారు. ఈ విద్యార్థిని ఆప్‌ కాస్ట్‌ మెంబర్‌ సెక్రటరీ అపర్ణ, ఎస్సీ ఇఆర్టి డైరెక్టర్‌ బి. ప్రతాపరెడ్డి డిఇఒ బి. లింగేశ్వర్‌ రెడ్డి, జిల్లా అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ టి. రాజేష్‌, ఇంచార్జి ప్రథానోపాధ్యాయులు శివరామకృష్ణ, ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పొట్నురు శ్రీరాములు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.ఎస్‌కోట:

➡️