ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : జాతీయస్థాయి కరాటే పోటీలో కశింకోట సెయింట్ జోన్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 9, 10 తేదీల్లో సామర్లకోటలో విక్టరీ సొట్ కాన్ కరాటే అసోసియన్ ఆధ్వర్యంలో జాతీయ కరాటే పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో కె.పనీష్, వై.ఆసీస్ అరివిందు, వైపి.ప్రీనిత్ సాయి, కేఏ.జోషెప్ బంగారు పతకాలు సాధించారు. వీరిని పాఠశాలలో సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆకాడమిక్ ఇంచార్జ్ రూపానంద, ప్రిన్సిపల్ చంద్రకళ, కరాటే కోచ్ సిహీచ్ సూర అప్పారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
