పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వ ర్యంలో నవోదయం నోడల్ అధికారులు జిల్లా కలెక్టరేట్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పం దన లభించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ అధికారు లకు దరఖాస్తులు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం పలువురు విద్య, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకు రుణాల కోసం వచ్చిన దరఖాస్తులు స్వీక రిం చారు. ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. కార్య క్రమంలో నవోదయం అధికారి ఓబుల్ నాయుడు, నోడల్ ఆఫీసర్ సంజీవ్ రావు, పలువురు ఎంపీడీవోలు, సచివాలయ సిబ్బంది, కలెక్టరేట్ స్టాప్, ఆయా కంపెనీల ప్రతినిధులు తదిరులు హాజరయ్యారు. మొత్తం 260 అప్లికేషన్లు స్వీకరించినట్లు సచివాలయ కమాండ్ కంట్రోల్ సిబ్బంది తెలిపారు. జిల్లా నలు మూలల నుండి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం తరలివచ్చిన యువ తకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పల్నాడు శాఖ ఉచిత భోజనాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిడిఒ మహాలక్ష్మి, నవోదయం అధికారి ఓబుల్ నాయుడు, నోడల్ అధికారి సంజీవ రావు, ఆయా శాఖల ప్రతినిధులు, బ్యాంకర్లు, కమాండ్ కంట్రోల్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.
