ప్రజాశక్తి – మార్కాపురం రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా 45వ మహాసభలు ఈనెల 12,13 తేదీల్లో ఒంగోలులో నిర్వహి స్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్. వినోద్ కోరారు. మహాసభల్లో విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో మార్కాపురం డివిజన్ పరిధిలోని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం అనే నినాదంతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 45వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభల్లో గత కార్యక్రమాలపై సమీక్షించి, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో విద్యారంగ అభివద్ధికి అవసరమైన తీర్మానాలు చేసేందుకు మహాసభలు వేదిక కానున్నట్లు తెలిపారు. అనంతరం మహాసభలకు సంబ ంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లోకేష్, హరీష్, షేక్ జబ్బర్ తదితరులు పాల్గొన్నారు
