టిడిపితోనే దళితులకు న్యాయం: వేగేశన

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలో టిడిపిలోకి వలసలు పెరిగాయి. తాజాగా సోమవారం బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారి పాలేనికి చెందిన వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు. అదేవిధంగా మండలంలోని బేతపూడి గ్రామానికి చెందిన 60 మంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరారు. టిడిపి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనలో దళితులకు రక్షణ కరువైందని అన్నారు. టిడిపి ప్రభుత్వంలోనే దళితులకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పిన్నిబోయినవారిపాలెం, బేతపూడి టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️