టిడిపితోనే మహిళలకు అండ : స్వామి

ప్రజాశక్తి-శింగరాయకొండ: టిడిపి మహిళలకు అండగా ఉంటుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం మూలగుంట పాడు పంచాయతీలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు కరెంటు స్తంభాలు, తాగునీటి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కూనపురెడ్డి వెంకట సుబ్బారావు, వేల్పుల సింగయ్య , చీమకుర్తి కృష్ణ, మందలపు గాంధీ చౌదరి , దక్షిణం శ్రీను, సన్నెబోయిన మల్లికార్జున, అంబటి శ్రీను, తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ సనావుల్లా, షేక్‌ సంధాని బాషా, షేక్‌ యస్‌థాని, కనిగిరి వెంకటేశ్వర్లు, సుదర్శి ప్రసాదరావు, శీలం చంటి, పసుపులేటి వెంకట శేషు తదితరులు పాల్గొన్నారు.

➡️