టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పలువురు బుధవారం టిడిపిలో చేరారు. కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్య వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మద్దిపాని కోటేశ్వరరావు, మాదాల శ్రీకాంత్‌, మాదాల అశోక్‌, పందిటి హరిబాబు, మేక హరికష్ణ, మెట్టుపల్లి బ్రహ్మయ్య, నరసయ్య, బక్క బాలకష్ణ ,మల్లెల శ్రీను , శివ, జడి శ్రీను, తగరం బాలకోటయ్య, రావినూతల ఏడుకొండలు, కూతల నాగరాజు, పంబ మాలకొండయ్య, కోతల పెద్ద పిచ్చయ్య, కోతల శ్రీనివాసరావు, కొర్లపాటి చెన్నయ్య, కోతల యూసఫ్‌ బొమ్మల బ్రహ్మయ్య పంతగాని నాగరాజు చిరుతోటి బ్రహ్మయ్య, కోతల లక్ష్మయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మించల బ్రహ్మయ్య, పులివర్తి లక్ష్మీనారాయణ, దగ్గుమాటి రామకష్ణ, కూనపు రెడ్డి సుబ్బారావు పాల్గొన్నారు.

➡️