టిడిపి, జనసేనతోనే మహిళా సాధికారత

ప్రజాశక్తి-మదనపల్లి మహిళల అభ్యున్నతికి పాటుపడే పార్టీలు తెలుగుదేశం, జనసేనేనని టిడిపి పట్టణ అధ్యక్షులు జోలేపాలెం భవాని ప్రసాద్‌ అన్నారు. నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశశ్వి రాజ్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాగానే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. కలలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, మహిళా నాయకులు మైథిలి, పులి మహాలక్ష్మి, లక్ష్మీదేవి, ఉషారాణి, తలారి రాధా, ప్రమీల, ఈశ్వరి, రాధా పాల్గొన్నారు. మిట్స్‌లో… కళాశాల ఐఐసి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ గీత దేవి ఆధ్వర్యంలో మహిళా దినత్సోవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సష్టికి మూలం మహిళ అని, మహిళ అనుకుంటే ఎంతపనైనా ఏ పనైనా సాధిస్తుందని చెప్పారు. వివక్ష వేధింపులు, సాధింపులున్నా, అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. స్త్రీ సమానత్వం, సాధికారతే సమాజ ప్రగతికి మూలమన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ కల్పన మాట్లాడుతూ ఇంటాబయట మహిళలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. మహిళలకు నిర్వహించిన కార్యక్రమాలలో బహుమతులను అందజేశారు. పీలేరు: రాష్ట్రంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ లక్ష్యమని మహిళా సంఘాలు తెలిపాయి. మహిళా దినోత్సవం సందర్భంగా టిడిపి కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆడబిడ్డ చదువుకు ఆటంకం కలిగి వారు ఇంటికి పరిమితం కాకూడదన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షులు సాధన, పీలేరు మండల అధ్యక్షులు పురం రెడ్డెమ్మ, రమాదేవి, లక్ష్మీ కాంతమ్మ, అనూరాధ, చందన, దేవమ్మ, షమ, కళావతి, కాంతమ్మ, రెడ్డిరాణి, హేమావతి, విజయ, రక్షిత, వనిత, రజిత, సుశీలమ్మ, లక్ష్మి దేవి, చంద్రలేఖ, వాణి పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి :మండల కేంద్రంలోని స్థానిక విశ్వభారతి ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు విశ్వభారతి పాఠశాల డైరెక్టర్‌ ఆర్‌.రామచంద్రయ్య, కరస్పాండెంట్‌ కె.రఘునాథరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం దశ్యాలతో సత్కరించారు కార్యక్రమంలో పాఠశాల ప్రైమరీ హెడ్మాస్టర్‌ ఆర్‌.రవీంద్ర ఉపాధ్యాయులు దర్బార్‌, చండ్రాయుడు, రవికుమార్‌, ధను, ప్రసాద్‌, ప్రతాప్‌ స్వామికొండ పాల్గొన్నారు.

➡️