టిడిపి హయాంలో బిసిలకు ప్రాధాన్యత

టిడిపి జయహో బిసి

ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని వేములవలసలో టిడిపి జయహో బిసి కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. వేములవలసలో భారీబహిరంగ సభ అనంతరం పెద్దిపాలెం వెల్లంకి మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్ల్లాడుతూ, టిడిపి పాలనలో బిసిలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యతను బిసిలంతా తమ భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, పాసర్ల ప్రసాద్‌, మీసాల సత్యనారాయణ, గనిరెడ్డి రమేష్‌, తమ్మిన విజయకుమార్‌, బుద్ధ త్రినాథ్‌, ఎర్నాకుల జగదీశ్వరరావు, డొకర అప్పలనారాయణ, గొల్లగాని సన్యాసిరావు, దేవగుప్త రమేష్‌, అంగటి రాము, వానపల్లి సత్య, బొద్దాపు శ్రీనివాస, పడాల అప్పలనాయుడు పాల్గొన్నారు

➡️